Rythu Bharosa : రైతు భరోస పై కీలక నిర్ణయం.. మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోస పై కీలక నిర్ణయం.. మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రైతులకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెబుతున్నారు. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు గాను వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీలో స్వల్ప చర్చ నిర్వహించడంతో పాటు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ మూడు పర్యాయాలు భేటీ అయింది. అదేవిధంగా గురువారం మరోసారి క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించి రైతు భరోసాపై చర్చించారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ అయింది.
రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
రైతు భరోసా పథకానికి సీలింగ్ ఎంతవరకు నిర్ణయించాలనే విషయంపై చర్చించారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఐటి చెల్లించే వారికి కూడా రైతు భరోసా నుంచి మినహాయింపు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతుల అభిప్రాయాలను సేకరించిన ప్రభుత్వం వారి అదృష్టమేరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయింది.
ఎకరానికి 15000 రూపాయలను ఏడాదికి రెండు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే సంక్రాంతికి ఒక విడత ఎకరానికి 7500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించింది. 7.20 ఎకరాల వరకు రైతు భరోసా సీలింగ్ విధించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన కీలక అంశాలపై ఈనెల నాలుగో తేదీన కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సబ్ కమిటీ నివేదికను కేబినెట్ సమావేశంలో ఉంటున్నారు.
MOST READ :
-
Miryalaguda : నూతన సంవత్సరం రోజు విషాదం.. నాగార్జునసాగర్ ఎడమ కాలవలో ఇద్దరు యువకుల గల్లంతు..!
-
Good News : రైతులకు మోడీ భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.10వేలు..!
-
Miryalaguda : మన సాక్షి పత్రికకు పెరిగిన ఆదరణ.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
-
Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!









