Breaking Newsతెలంగాణరాజకీయం

High Court : హైకోర్టు కీలక ఆదేశం.. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా..!

High Court : హైకోర్టు కీలక ఆదేశం.. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నాలుగు వారాల్లో పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు.. స్పీకర్ ను ఆదేశించింది.

నాలుగు వారాల్లో తమకు రిపోర్ట్ ఇవ్వాలని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే ఈ కేసును సుమోటోగా తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

దాంతో ముగ్గురి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందా..? అంటూ రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే లు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వాస్తవానికి నిబంధనల మేరకు స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలి. కానీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అనర్హత వేటు వేయకుండా నాన్చుతున్నారని విమర్శలు వచ్చాయి. దాంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తప్పదని, త్వరలో ఆ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తధ్యమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

LATEST UPDATE :

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!

Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు