Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Khammam : ఖమ్మంలో తీవ్ర విషాదం.. భార్యకు ఉరివేసి భర్త ఆత్మహత్య..!

Khammam : ఖమ్మంలో తీవ్ర విషాదం.. భార్యకు ఉరివేసి భర్త ఆత్మహత్య..!

మన సాక్షి, ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. భార్యకు ఉరివేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం బ్యాంక్ కాలనీలో జరిగింది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు చెందిన నరసింహారావు (65) భార్య కోటమ్మ (60) ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఖమ్మంలో ఉంటున్నారు

అద్దె ఇంట్లో ఉంటూ హోటల్లో వంట మాస్టర్ గా పని చేస్తున్నాడు. గతంలో నరసింహారావు పని చేసిన హోటల్ నుంచి ఒక వ్యక్తి నీళ్లు క్యాన్ తెచ్చేవాడు. మంగళవారం సాయంత్రం కూడా నీళ్ల క్యాన్ తెచ్చి పిలిచినా స్పందన లేకపోవడంతో ఇంటి యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. కిటికీలోంచి చూడగా మంచంపై కోటమ్మ, నరసింహారావు పడి ఉన్నారు. ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వివాహమై హైదరాబాదులో ఒకరు, నరసరావుపేటలో ఒకరు ఉంటున్నారు. భార్యకు పక్షవాతం రావడం చికిత్స పొందటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరివేసి చనిపోయిన తర్వాత తాను మనికట్టు వద్ద బ్లేడుతో కోసుకొని చనిపోయినట్లు తెలుస్తోంది.

■ MOST READ : 

  1. Nalgonda : అక్రమ ఇసుక రవాణాపై జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. డయల్ 100 కు చేయండి..!

  2. Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

  3. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కి గైరాజరైన అధికారులకు నోటీసులు..!

మరిన్ని వార్తలు