District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కి గైరాజరైన అధికారులకు నోటీసులు..!
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కి గైరాజరైన అధికారులకు నోటీసులు..!
ఖమ్మం బ్యూరో, మన సాక్షి:
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డి.ఆర్.ఓ. ఏ. పద్మజ, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన అధికారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు సమాచారం అందించి వారి అనుమతి లేకుండా జిల్లా అధికారులు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
అధికారులకు శాఖాపరమైన సమావేశాలు హైదరాబాద్ లో ఏవైనా ఉంటే ముందుగా జిల్లా యంత్రాంగం అనుమతి తీసుకోవాలని, ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ఉదయం సమయానికి వచ్చి అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేని సమయంలో, సీనియర్ అధికారి ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రజలతో మర్యాదగా, జవాబుదారీతనంతో ప్రవర్తించాలని అన్నారు. ప్రజావాణికి సంబంధించి వచ్చిన అర్జీలను పరిశీలన చేసి పెండింగ్ లో లేకుండా అర్జీలను వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఖమ్మం నగరం పాకబండ బజార్ కు చెందిన జి. జాన్సీ తన కుమార్తె భవానికు శాశ్వత దృష్టి లోపం ఉందని, తన కూతురుకు 100 శాతం దృష్టి లోపం ఉన్నందున 100 శాతం వైకల్యంతో సదరం సర్టిఫికెట్ జారీ చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు రాస్తూ పరీక్షించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఖమ్మం నగరానికి చెందిన బి. వినయ్ కుమార్ తనకు వికలాంగుల కోటాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ కు రాస్తూ పరిశీలించి అర్హత, అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం అర్బన్ మండలం పుట్ట కోటకు చెందిన డి. నర్సమ్మ తాను గత 50 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నానని, తనకు పట్టా పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గిరిజన సంక్షేమ అధికారికి రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్. అరుణ, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
MLC Kavitha : కేసిఆర్ పాలన ఐఫోన్.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్..!
-
Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు..!
-
Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)









