అమ్మాయి కిడ్నాపు.. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు..!

అమ్మాయి కిడ్నాపు.. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు..!

రామసముద్రం, మన సాక్షి:

మండల కేంద్రంలోని దిగువ హరిజనవాడకు చెందిన ఒక అమ్మాయిని 25-02-2024 వా తేదీ అదే దిగువ హరిజనవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు భయపెట్టి కిడ్నాప్ చేసి తనకు వరసకు బావ అయిన సుదర్శన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోమని కొట్టి నిర్బంధించినారని , పెళ్లి చేసుకోకపోతే చంపుతామని బెదిరించినట్లు వారి బారి నుండి తప్పించుకొని తన తండ్రి వద్దకు చేరుకొని నట్లు, తన తండ్రికి జరిగిన విషయం చెప్పగా తన కూతురి జీవితం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో గ్రామ పెద్దల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చూసినా గాని సుదర్శన్, మని మరియు ప్రశాంత్ లు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే 05-03- 2024 వ తేదీ రామసముద్రం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది.

ALSO READ : BREAKING : నల్గొండలో కీచక ఉపాధ్యాయులు.. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, అరెస్టు చేసిన పోలీసులు..!