సూర్యాపేట : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి సవాల్.. ఏంటో చూద్దాం.. !

సూర్యాపేట : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ ఏంటో చూద్దాం.. !
సూర్యాపేట, మన సాక్షి :
తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధి ని మీ నేత, ప్రధాని మోడీ సొంతరాష్ట్రం, 25 సంవత్సరాలుగా బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్ రాష్ట్రంతో పోల్చి చూద్దామా..? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.
డబుల్ ఇంజిన్ సర్కార్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి గుజరాత్ లో ఒరగపెట్టింది ఏమి లేదని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.
ఉద్యోగాల కల్పన పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తం బిజెపి పాలిత రాష్ట్రాలలో కలిపి కుడా గడిచిన తొమ్మిది ఏళ్లలో తెలంగాణా లో ఇచ్చిన అన్ని ఉద్యగాలు కల్పించ లేకపోయారని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!
సరైన ప్రత్యామ్నాయం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్నారు.కాంగ్రెస్,బిజెపి లకు ప్రత్యామ్నాయం ఉన్న చోట కాంగ్రెస్,బిజెపి యేతరులే విజయం సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణా లో ఉనికి కోసమే బిజెపి పడరానిపాట్లు పడుతుందని ఆయన ఎద్దేవాచేశారు.తెలంగాణా గురించి మాట్లాడే నైతికతనే కిషన్ రెడ్డి కి లేదని ఆయన తేల్చిచెప్పారు.
అంతగా ప్రేమ ఉంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చి మాట్లాడితే మీమీద విశ్వసనీయత పెరుగుతుందని, ఇప్పటి వరకైతే క్షేత్ర స్థాయిలో అటువంటిది ఏమి కనపడడం లేదన్నారు. బిజెపి కుట్రలు తెలంగాణా లో పని చెయ్యవని, యావత్ తెలంగాణా సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని ఆయన తెలిపారు.
అడ్డదిడ్డంగా మాట్లాడితే ఇక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారాని,2014, 2018 ఎన్నికల్లో అదే జరిగిందని 2023 ఎన్నికల్లో అదే జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హెచ్చరించారు.
Also Read : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!
ఈ సమావేశంలో జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ ,నాయకులు వై వెంకటేశ్వరరావు ,నెమ్మది బిక్షం ,ఉప్పల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.?