విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి – పాండురంగారావు

విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి – పాండురంగారావు

విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి

విద్యతోపాటు నైపుణ్యం అవసరం

కోదాడ డిసెంబర్30, మన సాక్షి : విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కొరకు అహర్నిశలు కృషి చేయాలని మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఎమ్మెస్ కళాశాల విద్యాసంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు లు పేర్కొన్నారు.

శుక్రవారం ఎమ్మెస్ కళాశాల ఆడిటోరియంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొని మాట్లాడారు. గత 35 సంవత్సరాలుగా ఎమ్మెస్ కళాశాల పేద విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే అరకోర స్కాలర్ షిప్ లు తప్ప ఎటువంటి ఫీజులు తీసుకోకుండా లాభపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ ఎందరినో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు నాగిరెడ్డి విశేష కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. విద్యార్థులు విద్యతోపాటు సమాజంలో జరుగుతున్న సామాజిక అంశాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.

కన్న తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను ప్రతి విద్యార్థి నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఇంటర్మీడియట్ లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రంగారావు, అధ్యాపకులు దుర్గాప్రసాద్, రాజు ,గోపి, పందిరి శ్రీనివాసరెడ్డి, శ్రీను, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు……….