Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

Telangana : ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడమే తప్ప అంటూ.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ట్వీట్..!

Telangana : ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడమే తప్ప అంటూ.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ట్వీట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా ఆయన మరోసారి విరుచుకపడ్డారు. ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడమే తప్ప.. అన్నదాత ఆర్తా నాదాలు వినపడవా..? అంటూ ఆయన సీరియస్ అయ్యారు. రైతు సమస్యల వినే ఓపిక లేదంటూ.. ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా? అంటూ ప్రశ్నలు సంధించారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

కేటీఆర్ ట్వీట్ ఇది..

ముఖ్యమంత్రి గారు..
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?

నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??

ఎన్నికల గోల తప్ప..
ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?

సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప..
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..??

ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..?
పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ??

పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ?

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ..
రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ?

ఇంతకాలం..
పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..!

ఇప్పుడు..
నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..?

గుర్తు పెట్టుకోండి..!!
ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !!

అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై..
భారత “రైతు” సమితి.. పోరాడుతూనే ఉంటది..!!!

జై కిసాన్
జై తెలంగాణ

మరిన్ని వార్తలు