భూ వివాదంతో హత్య..!

సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అల్మాయిపేట గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన మునీరోద్దీన్ (50) హత్య భూ వివాదం కారణంగానే జరిగిందని జోగిపేట సిఐ అనీల్ కుమార్ తెలిపారు.

భూ వివాదంతో హత్య..!

అల్మాయి పేట హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై హత్య కేసు

ఆందోలు, మన సాక్షి:

సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అల్మాయిపేట గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన మునీరోద్దీన్ (50) హత్య భూ వివాదం కారణంగానే జరిగిందని జోగిపేట సిఐ అనీల్ కుమార్ తెలిపారు. బుధవారం జోగిపేట సిఐ కార్యాలయంలో హత్య కేసుకు సంబంధించి నిందితుల వివరాలను తెలియ జేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

సీఐతో పాటు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ గౌడ్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అల్మాయిపేట శివారులోని 580 సర్వేనంబర్‌లో అల్మాయిపేటకు చెందిన హయాత్‌బీ పేరిట 1.30 ఎకరాల భూమి ఉంది. ఆమె కూతురుకు డాకూర్‌కు చెందిన కమ్రోద్దీన్‌తో వివాహం జరిపించి ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరంతా హైదరాబాద్‌లో స్ధిరపడ్డారు. గ్రామంలో ఉంటున్న హయాత్‌బీ బావ ఇస్మాయిల్‌ కోడుకు మునీరొద్దిన్‌ ఈ భూమిలో తమకు వాటా ఉందంటూ కమ్రోద్దీన్‌తో తరుచూ గొడవలు జరుగుతుండేవి.

ALSO READ : BREAKING : అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

ఈ నెల 11వ తేదీన భూమి విషయంలో పోలీస్‌ స్టేషన్‌ వరకు వేళ్లగా పోలీసులు ఇరువురికి నచ్చజేప్పి పంపించారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌ నుంచి కమ్రోద్దీన్, అతని కుటుంబీకులైన గఫర్, కరిష్మాబేగం, మహముబాబేగం, ఎండీ. ఖాదీర్, దూదేకుల అషియాబేగంలు పోలం వద్ద పనులు చేయిస్తుండగా, గ్రామంలో ఉంటున్న మునీరొద్దిన్‌ అక్కడికి వెళ్లారు దీంతో గొడవ ప్రారంభం అయ్యింది. మాటా మాటా పెరగడంతో కమ్రోద్దీన్‌ పక్కనే ఉన్న పారతో మునీరొద్దిన్‌ తలపై బాదడంతో కుప్పకూలి కింద పడిపోయాడు.

దీంతో అక్కడే ఉన్న కుటుంబీకులు బండరాళ్లతో మునీరొద్దిన్‌ ముఖంపై మోదడంతో అక్కడికక్కడే మతి చెందినట్లు సీఐ తెలిపారు. వీరంతా అక్కడి నుంచి పారిపోగా, వారి కోసం రెండు రోజులుగా గాలిస్తుండగా సంగుపెట వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా, తామే చంపామని ఒప్పుకొవడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.