BREAKING : అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయట నుంచి నిరసన తెలిపారు. మీడియా పాయింట్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్దకు ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు వెళ్లనిచ్చేది లేదని మార్షల్ అడ్డుకున్నారు.

BREAKING : అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయట నుంచి నిరసన తెలిపారు. మీడియా పాయింట్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్దకు ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు వెళ్లనిచ్చేది లేదని మార్షల్ అడ్డుకున్నారు.

అసెంబ్లీ లోపల మాట్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిసారి రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు. అసెంబ్లీ లోపల మాట్లాడనివ్వకుండా, బయట మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనివ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని, ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చ చేస్తున్న కడియం శ్రీహరికి కూడా మైకు ఇవ్వలేదన్నారు. అనంతరం తెలంగాణ భవన్ కు వెళ్లారు.

ALSO READ : Telangana : శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. అధికార పక్ష సభ్యుల విచిత్ర కామెంట్..!

బైఠాయించిన వారిలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు , వల్ల రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, మహేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.