గ్రామ కంఠం భూమి కబ్జా గురి..!

ప్రభుత్వం ఏదైనా కబ్జా మాత్రం ఒకటే, ప్రజాప్రయోజనాలు పక్కన పెట్టి స్వప్రయోజలకే మొగ్గుచూపుతున్న ప్రజాప్రతినిధులు .

గ్రామ కంఠం భూమి కబ్జా గురి..!

హత్నూర, మన సాక్షి:

ప్రభుత్వం ఏదైనా కబ్జా మాత్రం ఒకటే, ప్రజాప్రయోజనాలు పక్కన పెట్టి స్వప్రయోజలకే మొగ్గుచూపుతున్న ప్రజాప్రతినిధులు . సాదుల్ల నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో పాత గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి 12 గుంటల గ్రామకంఠం స్థలం ఆక్రమలకు గురైంది.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ అక్రమంగ కబ్జా చేశారని మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, గ్రామస్తులు ఆరోపించారు. బుధవారం గ్రామకంఠం స్థలాన్ని వారు సందర్శించారు. సుమారు 12 గుంటల భూమి కబ్జాకి గురైందని ఇట్టి భూమిని సాదుల్ల నగర్ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలకు లేదా ప్రభుత్వ కార్యాలయాల కొరకు అనుకూలమైన స్థలం అని గ్రామస్తులు అన్నారు.

ఇట్టి భూమిని పేదలకు చెందెలా లేదా ప్రజాప్రయోజనాలకు ఉపయోగించు కొనెల సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని , సాదుల్లానగర్ మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ పంచాయతీ  సభ్యులు బోయిన మొగులయ్య, ఓనం గారి వీరేశం, గడ్డం రామరాజు, తలారి భాస్కర్, గ్రామస్తులు ఓనం గారి ప్రభు, తంగడపల్లి ప్రభు గౌడ్, బాన్సువాడ శ్రీకాంత్ గౌడ్, కడల కృష్ణ, కుమ్మరి కృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.

ALSO READ : పోలీస్‌ కొలువు సాధించినందుకు గర్వపడాలి… జిల్లా ఎస్పి చందాన దీప్తి..!