BREAKING : సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధం

సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధమైన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

BREAKING : సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధం

శంకర్‌పల్లి: (మన సాక్షి):

సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధమైన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫైర్ ఆఫీసర్ జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి మండల మోకిల పరిధిలో గల విజేత సూపర్ మార్కెట్ వెనకాల ఇంప్రోటెక్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో అపార్ట్మెంట్ లను నిర్మించడానికి 50 గుడిసెలు ఏర్పాటు చేశారు.

బుధవారం మధ్యాహ్నం మూడు సిలిండర్లు పేలి 11 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. నానక్ రామ్ గూడ నుండి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పి వేశారు. 3లక్షల ఆస్తి నష్టం కలిగిందని కంపెనీ సూపర్ వైజర్ శివకుమార్ తెలిపారు. గుడిసెలలో 120 మంది లేబర్ నివాసం ఉంటున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని సిఐ వీరబాబు పేర్కొన్నారు.

మోకిలలో ఫైర్ స్టేషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో ఎస్సై కోటేశ్వరరావు, ఫైర్ సిబ్బంది ఎల్ఎఫ్ లింగస్వామి, డిఓపి నైముద్దీన్, హెచ్ జి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ALSO READ : ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మహిళ ఉద్యోగిని.. ఇంట్లో కట్టల కొద్ది నోట్లు, కిలోల కొద్ది బంగారం..!