తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : భారత రాజ్యాంగ పూర్తిస్థాయి అమలు కోసం పోరాటం చేద్దాం.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం..!

Suryapet : భారత రాజ్యాంగ పూర్తిస్థాయి అమలు కోసం పోరాటం చేద్దాం.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం..!

సూర్యాపేట, మనసాక్షి :

భారత స్వాతంత్ర సంగ్రామ ఆకాంక్షల ప్రతిబింబమే భారత రాజ్యాంగం అని ఆ భారత రాజ్యాంగ పూర్తిస్థాయి అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సూర్యాపేట పౌర ప్రజాస్వామిక వేదిక నిర్వహించిన 75 ఏళ్ల భారత రాజ్యాంగం గమ్యం గమనం సెమినార్లో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ భారత రాజ్యాంగం ప్రతి ఆర్టికలు ఎంతో శాస్త్రీయంగా ఎంతో మేధో మద ణంతో చర్చలు జరిపి తయారు చేసుకున్నదని అన్నారు.

ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందుబాటులోకి తేవడం కొరకు ఇచ్చిన ఒక అల్టిమేటమే భారత రాజ్యాంగం అని పేర్కొన్నారు.కొంతమందికి ఈ రాజ్యాంగం జీవన ఆధార గ్రంథమైతే అవినీతి పాలకులకు ఇది ప్రతిబoదకంగా మారిందని అందుకనే ఈ అవినీతి పాలకులు రాజ్యాంగం మార్చటానికి కుట్రలు పన్ను తున్నారని ఆయన విమర్శించారు.

భారత రాజ్యాంగం జీవించే హక్కుతో పాటు అన్ని రకాల స్వేచ్ఛను రాజకీయ ఆర్థిక సమానత్వాన్ని వాగ్దానం చేసిందని ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అని పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ దలిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరకు సంబంధించిన వ్యక్తి కాదని భారత దేశ చారిత్రక పరిణామాలను వివిధ రకాల వ్యవస్థలను అధ్యయనం చేసి భారత ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా భారత రాజ్యాంగం నిర్మించారని అన్నారు.

ఈరోజు అన్ని సెక్షన్ల ప్రజానీకం అనుభవిస్తున్న ఓటు హక్కు అనేది అంబేద్కర్ ఎంతో సాహసంతో కొట్లాడి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం అని ఎవరు మర్చిపోకూడదని అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 3 మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మర్చిపోరాదు అన్నారు.

మండల్ కమిషన్ లాంటి కమిషన్లను ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఈమేర కన్నా అమలవుతున్నాయని ఆయన అన్నారు. భారత ప్రజలకు ప్రధానంగా అణగారిన వర్గాలకు దేశ ఆర్థకాభివృద్ధికి భద్రతకు భారత రాజ్యాంగం పెద్ద రక్షణ కవచం అని అన్నారు.

నల్సార్ న్యాయ శాస్త్ర ఆచార్యులు మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగం కంటే ముందు ఉన్న అన్ని శాస్త్రాలు కులాన్ని మతాన్ని ప్రజలను వేరు చేసినట్టుగా ఉన్నాయని భారత రాజ్యాంగం మాత్రమే ప్రజలందరూ ఒకటేనని సమానత్వమే లక్ష్యమని భారత రాజ్యాంగ పీఠిక ద్వారా ప్రకటించడమే గొప్ప విప్లవం అని అన్నారు.

భారత రాజ్యాంగాన్ని యధాతధంగా నిజాయితీతో అమలు చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని అంతరాలు తొలగిపోతాయని ప్రజల మధ్య లౌకిక, సౌభాతృ త్వ ,సామాజిక ,ఆర్థిక రాజకీయ సమానత్వం ఏర్పడుతుందని అన్నారు.

తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మాట్లాడుతూ రానున్న కాలంలో ఈ సాంప్రదాయక రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు మేనిఫెస్టోలను కాలనీ రాజ్యాంగం అమలు అనే ఒక ఏకైక మేనిఫెస్టో తోటే తెలంగాణ కానీ ఇతర జాతీయ రాజకీయాలు కానీ కొనసాగాల్సిన అవసరం ఉందని దాని ద్వారా మాత్రమే అవినీతి రహిత పాలనతో కూడుకున్న భారతదేశాన్ని నిర్మించవచ్చని అన్నారు.

ఈ సమావేశానికి తండు నాగరాజు గౌడ్ కిరణ్ ముదిరాజ్ కొంచెం చంద్రకాంత్ మచ్చలకు గోపి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సెమినార్ లో ప యువత విద్యావంతులు డాక్టర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  2. Hyderabad : హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు.. ఎల్బీనగర్ టు ఖైరతాబాద్.. (వీడియో)

  3. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

  4. February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

  5. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు