Licker : భారీగా దేశిదారు మద్యం పట్టివేత

భారీగా దేశిదారు మద్యం పట్టివేత

కొమురం భీమ్ ఆసిఫాబాద్, మన సాక్షి

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. ఎస్పీ కే సురేష్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు కాగజ్ నగర్ పెద్ద వాగు సమీపంలోని మైసమ్మ గుడి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

 

మహారాష్ట్ర నుండి కాగజ్ నగర్ కు రెండు కారులలో బ్లాక్ గ్లాసులు అమర్చి అక్రమంగా తరలిస్తున్న 30 దేశి దారు మద్యం కాటన్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

 

Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!

 

ఎంఎచ్ 04 బి డబ్ల్యు 611 శాంట్రో, ఎం హెచ్ 49బీబీ5818 టయోటా కారులో నలుగురు వ్యక్తులు కలిసి మద్యాన్ని కాగజ్ నగర్ చుట్టుప్రక్కల గ్రామాలకు తరలిస్తు పట్టుబడినట్లు తెలిపారు

 

మార్కెట్లో దేశిదారు మద్యం బాటిల్స్ విలువ సుమారు రూ1.80 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.

 

మద్యాన్ని తరలిస్తున్న రెండు కార్లను సీజ్ చేసి, మద్యాన్ని, నలుగురు నిందితుల పై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ సుధాకర్ తెలిపారు.

 

సీఐ వెంట ఎస్సై లు సందీప్ కుమార్, సానియా, సిబ్బంది మధు, రమేష్, సంజీవ్, శ్రీను, ఉన్నారు.