మాడ్గులపల్లి : లారీని ఢీ కొని యువకుడు మృతి

మాడ్గులపల్లి : లారీని ఢీ కొని యువకుడు మృతి

మాడ్గులపల్లి , మనసాక్షి:

ఎలాంటి హెచ్చరికలు లేకుండా రోడ్డు వెంట నిలిపిన లారీని ఢీ కొని యువకుడు మృతి చెందిన ఘటన మాడ్గులపల్లి లోని టోల్ ప్లాజా సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

 

Also Read : GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏపీ లోని గుంటూరు జిల్లా,తాటికొండ మండలం, లామ్ గ్రామానికి చెందిన మాతంగి సిద్దు(24)అనే యువకుడు తన గ్రామం నుంచి హైదరాబాద్ కి తన ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. మాడుగులపల్లి లోని టోల్ ప్లాజా సమీపంలో కి రాగానే ఎలాంటి హెచ్చరికలు లేకుండా రోడ్డు వెంట నిలిపిన లారీని ఢీ కొట్టాడు.

 

Also Read : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

 

దీంతో తలకి తీవ్రంగా గాయం కావడంతో నల్గొండ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు సుమారుగా 10:40 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుని బావ చిట్టిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.