Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు

Madanapalle : ఆకట్టుకున్న దసరా బొమ్మల కొలువు..! 

Madanapalle : ఆకట్టుకున్న దసరా బొమ్మల కొలువు..! 

మదనపల్లె టౌన్, మనసాక్షి :

దసరాను పురస్కరించుకుని మదనపల్లె పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌.రాటకొండ గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పూజల్లో మూలానక్షత్రం రోజున..ప్రణో దేవీ సరస్వతీ అంటూ వాగ్దేవిని ప్రత్యేకంగా ఆరాధించడం ఆనవాయితీ అన్నారు. ఆదిశక్తిని మహాసరస్వతి రూపంలో కొలవడం ఈరోజు ప్రత్యేకత అన్నారు.

సరస్వతీదేవిని పూజించిన వారికి విద్యాసంపదను, ధనధాన్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు కళాశాలలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.

సరస్వతీపూజకు విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై, అమ్మవారి ఆశీర్వాదాలు పొందడంతో పాటుగా బొమ్మలకొలువును సంతోషంగా తిలకించడం జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సురభి రమాదేవి, అధ్యాపకులు డాక్టర్‌.రమ్య, కవిత, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు