Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణసిద్దిపేట జిల్లా

Dubbaka : ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి..!

Dubbaka : ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి..!

దుబ్బాక, మనసాక్షి :

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో చోటుచేసుకుంది. దుబ్బాక ఎసై గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్డే వల్లెపు రాములు(55) వృత్తి వడ్డెర అనే వ్యక్తి తన స్వగ్రామంలో నూతనంగా కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు.

రోజు వారిగా ఇంటికి నీళ్లు పడుతున్న క్రమంలో ప్రమాదవ శాత్తు నల్లా మోటర్ ఎడుమ కాలుకు కరెంట్ షాక్ వచ్చిందని, మేము వెళ్లి చూసే సరికి కింద పడి చనిపోయి ఉన్నారని భార్య వల్లెపు లక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. నా భర్త మృతి పట్ల ఎలాంటి అనుమానం లేదని తెలిపింది.

మృతునికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎసై గంగరాజు తెలిపారు.

ALSO READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు