మహనీయుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయం – మందకృష్ణ మాదిగ

మహనీయుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయం
– మందకృష్ణ మాదిగ

మునగాల, మనసాక్షి
దేశం కోసం, దేశ అభివృద్ధికి, పేద బడుగు బలహీనవర్గాలు, సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పాటుపడి తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను, త్యాగధనులను స్మరించుకుంటూ వారి విగ్రహాలను గ్రామంలో ఒకే చోట ఆవిష్కరించుకోవడం అభినందనీయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొనియాడారు.

 

బుధవారం రాత్రి మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ఎపిజెబి మహనీయుల విగ్రహాల నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధ, జ్యోతిరావు పూలే, జగ్జీవన్ రామ్, డా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను, ప్రొఫెసర్ ఖాసిం, శతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపళ్లి సుజాత, భరత్ భూషణ్ లతో కలిసి ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ మహనీయులను స్మరించుకోవడమే కాకుండా వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు.

 

ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన మహాత్ముల, త్యాగధనుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం, సంతోషకరమన్నారు. గ్రామంలో ఒకే చోట నలుగురు మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు.

 

అదే విధంగా దేశం కోసం, సమ సమాజం కోసం పోరాడిన, పాటు పడిన మహనీయుల, త్యాగధనుల విగ్రహాలను పల్లెల్లో కూడా గుర్తుంచుకునేలా పలు కూడళ్లలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతకుముందు నీలి జెండాను ఎగరవేశారు.

 

ఈ కార్యక్రమంలో బండారు సైదులు, సూరేపల్లి వెంకటేశ్వర్లు,పోడెటి చంద్రయ్య,బచ్చలకూర జార్జి,అంజయ్య, వెంకయ్య, యం వెంకయ్య, మనోజ్ కుమార్, రమేష్, జాన్ విల్సన్, ఎ రాజు, ఎల్ పి శీను, సర్పంచ్ కోండపల్లి‌ విజయ నర్సింహారావు,

 

జితేందర్ రెడ్డి, నెమ్మది శ్రీనివాసరావు, కె ఆంజనేయులు,‌ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, పిల్లుట్ల రఘు, ప్రజా సంఘాలు,దళిత బహుజన సామాజిక వేత్తలు, తదితరులు‌ పాల్గొన్నారు.