షుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్ గా ఎండి షాదుల్ సాబ్..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల జంగి బి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షాదుల్ సాబ్ ను రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ మంగళవారం మాగీ షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించిన సిడిసి చైర్మన్ ఎంపిక చేస్తున్నట్లు ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది.

షుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్ గా ఎండి షాదుల్ సాబ్..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల జంగి బి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షాదుల్ సాబ్ ను రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ మంగళవారం మాగీ షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించిన సిడిసి చైర్మన్ ఎంపిక చేస్తున్నట్లు ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా షాదుల్ సాబ్ మాట్లాడుతూ… తన ఎంపికకు సహకరించిన రాష్ట్ర ఐటి అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే లు పట్లోళ్ల సంజీవరెడ్డి లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వారితోపాటు డిసీసీ జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం. రైతుల అభివృద్ధి కోసం తన శాయశక్తుల కృషి చేస్తానని ఆయన పత్రికా విలేకరులతో తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

చట్నీలో ఎలుక.. జేఎన్టీయూ కళాశాలలో కలకలం, మంత్రి ఆరా..!

ACB RAIDS : రూ.15వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇంజనీరింగ్ ఏఈ..!