చట్నీలో ఎలుక.. జేఎన్టీయూ కళాశాలలో కలకలం, మంత్రి ఆరా..!

చట్నీలో ఎలుక.. జేఎన్టీయూ కళాశాలలో కలకలం, మంత్రి ఆరా..!

ఆందోల్ , మన సాక్షి :

చట్నీలో ఎలుక ప్రత్యక్షమైన సంఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ బాలుర కళాశాల హాస్టల్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన సోమవారం జరిగినప్పటికీ మంగళవారం కలకలం రేపింది. సోమవారం రాత్రి హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారానికి సంబంధించిన చట్నీలో ప్రాణంతో ఉన్న ఎలుక ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు ఫోన్ లో వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అది కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటనతో మంగళవారం హాస్టల్లో కలకలం రేపింది. చట్నీలో ఎలుకబడిన విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ వెళ్లి పరిశీలించారు. విద్యార్థులు తిని వెళ్లిన తర్వాత చట్నీ పాత్ర కడిగేందుకు పాత్రలో నీళ్లు పోసి ఉంచిన దాంట్లో ఎలుకబడిందని ఆయన వివరణ ఇచ్చారు.

ALSO READRation Cards : మీ రేషన్ కార్డులో పేర్ల తప్పులు, కొత్త పేర్లు యాడ్ చేయడం.. అడ్రస్ చేంజ్.. లేటెస్ట్ అప్డేట్స్..!

ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం పట్టడం లేదని కాంట్రాక్టర్ ను మార్చాలంటూ విద్యార్థులు ఆందోళన దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల ఆహార తనిఖీ అధికారి ధర్మేందర్ హాస్టల్లో కూడా తనిఖీ చేసి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతలోనే చట్నీలో ఎలుక ప్రత్యక్షం కావడంతో హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీసి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై అడిషనల్ కలెక్టర్ మాధురి కళాశాలలోని హాస్టల్ సందర్శించారుహ. వారం రోజుల క్రితం ఆహారతనిఖీ అధికారి వచ్చి పరిశీలించినా కూడా మార్పు రాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంఘటనకు బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆర్డిఓ పాండు, ఆహార తనిఖీ అధికారి ధర్మేందర్ తదితరులు ఉన్నారు.

ALSO READ : 

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

BREAKING: మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ విస్తృత తనిఖీలు.. ఉద్యోగుల పై ఆగ్రహం..!