తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలువైద్యం

Hospitals : ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు..!

Hospitals : ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు..!

కరీంనగర్ మనసాక్షి:

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో తమ టీం సభ్యులతో కలిసి తనిఖీలు చేశారు. ప్రైవేటు హాస్పిటల్స్ లోని పనితీరు వారు నిర్వహించే రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, మరియు కేస్ రికార్డ్స్, సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని తనిఖీ చేశారు.

తనిఖీ సమయంలో ప్రత్యేక వైద్య నిపుణులైన గైనకాలజిస్ట్లు ఇతర క్వాలిఫైడ్ స్పెషలిస్టుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ ను వెరిఫై చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న డెలివరీలలో పుట్టిన వెంటనే గంటలోపు తల్లిపాలు శిశువులకు అందించడంపై సరియైన అవగాహన కల్పిస్తున్నారా లేదా అని పరిశీలించారు.

అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రము హౌసింగ్ బోర్డ్ కాలనీ ని సందర్శించి అందులో పలు రికార్డులు అటెండెన్స్ రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టర్, రక్తపోటు, షుగర్ వ్యాధి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సీజన్లో వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మరియు ఫీవర్ సర్వే యాక్షన్ ప్లాన్ ప్రకారము నిర్వహించాలని జ్వరపీడితులను గుర్తించి వెంటనే చికిత్స చేయాలని ఆదేశించారు.

తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రము సవరన్ వీధిలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సిడిపిఓ సబిత తో కలిసి తల్లిపాల ప్రాముఖ్యత మీద అవగాహన కల్పించారు. ఈ తనఖిల్లో పిఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనజవేరియా, సిడిపిఓ సబిత, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసాద్, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  2. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  3. RDO : వైద్యులకు ఆర్డీవో కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!

  4. Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

  5. TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

మరిన్ని వార్తలు