Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!
నేలకొండపల్లి, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ నిర్మాణం పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అనర్హులకు మంజూరైనా వాటిని రద్దు చేస్తామన్నారు.
నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ను నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ. సమాచార శాఖ మంత్రియ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కోన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లో విస్తుత పర్యటన చేశారు. వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు… వారం రోజులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొలి విడత గా నాలుగున్నర లక్షల ఇళ్ల ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అసలైన నిరుపేదలు ముందుగా ఇళ్ల ను నిర్మించుకోవాలని అన్నారు. ఎన్నికల నాటిని ఇళ్లు లేని పేదవాడు మిగలకూడదని అన్నారు. ఎక్కడైనా ఉన్న వారికి ఇళ్ల ను ఇస్తే వాటిని రద్దు చేస్తానని హెచ్చరించారు.
నాడు వైఎస్ఆర్ 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ పాలన అందించారని అన్నారు. నేడు ఈ ప్రభుత్వం అదే ఇందిరమ్మ పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా… ఇదే అదరణ అందించాలని అన్నారు. పేదోళ కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం ఉందన్నారు. ఇచ్చిన హమీలను అన్ని కూడ త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు.
MOST READ :
-
Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!
-
Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
-
Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!
-
Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!









