జేపీఎస్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జేపీఎస్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణ పరచాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ముగిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న గ్రామపంచాయతీ కార్యదర్శులు వెంటనే క్రమ భర్తీకరించాలని కోరారు. 2019 ఏప్రిల్ నుండి వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నారని నోటిఫికేషన్ ప్రకారం వీరి ప్రోహిబియేషన్ కాలం గత 2022 ఏప్రిల్ నాటికి పూర్తి అయిందని పేర్కొన్నారు.

 

అయినా మరొక సంవత్సరం గడువు పెంచినప్పటికీ ఆ గడువు కూడా 11 ఏప్రిల్ 2023 తో పూర్తయిందని తెలిపారు. ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు.