మిర్యాలగూడ : మంత్రుల పర్యటన అడ్డుకోండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు..!

మిర్యాలగూడ : మంత్రుల పర్యటన అడ్డుకోండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అభివృద్ధి పేరుతో రకరకాలుగా ప్రజలకు మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని 26న మంత్రులు హరీష్ రావుని జగదీష్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
గురువారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ
గత ఐదు సంవత్సరాల క్రింద 13-7-2017న మిర్యాలగూడ వచ్చి శంకుస్థాపనలు చేసి సమావేశాలు ఏర్పాటు చేసి మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయాన కొబ్బరికాయలు కొట్టడం శంకుస్థాపన చేయడం తప్ప ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏమీ ఒరిగింది లేదన్నారు.
1300 వందల మంది విద్యార్థులు తెలంగాణ కొరకు ఆత్మ బలిదానం చేసుకుంటే … మన నిధులు.. మన నీళ్లు మన నియామకాలు మనకి కావాలని తెలంగాణ సాధించుకుంటే లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రభుత్వం మిర్యాలగూడ పట్టణంలో అంతర్గత రోడ్లు వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి వ్యవస్థ ఇవ్వలేదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నామన్నారు.
రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నదని, ఎన్నికల సమయం దగ్గర రాగానే గారడి మాటలు జిముక్కులతో శంకుస్థాపన స్థాపనల పేరుతో డబ్బులు దోచుకోవడం…. అలాగే సుందర్ నగర్ కాలనీలో ఒక చిన్న స్లాబ్ కు 25 లక్షల రూపాయలు కేటాయించి అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డిసిసి సభ్యులు చిలుకూరి బాలు మాట్లాడుతూ మంత్రుల పర్యటన అంగు ఆర్భాటాలతో భుజాలు తడుముకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల క్రితం వచ్చి శంకుస్థాపనలు చేసి పోయినవాటికి అతిగతి లేదని, వంద పడకల ఆసుపత్రిని మార్చి 100 పడకల ఆసుపత్రిగా 14 కోట్ల రూపాయలు సాంక్షన్ చేసుకొని బినామీ కాంట్రాక్టర్లుగా అధికార పార్టీ వారు చేస్తూ మళ్లీ శంకుస్థాపన పేరిట ఈ 1400 కోట్లు టెండర్లు బినామీలకు కట్టబెట్టి ఏం చేద్దామని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి , డిసిసి సభ్యులు చిలుకూరి బాలు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడ బోయిన అర్జున్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామలింగయ్య , మైనార్టీ అధ్యక్షుడు గౌస్ , యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సిద్దు , మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.