మిర్యాలగూడ : జిల్లా సాధన సమితి సభ్యుల అరెస్టు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులను ముందస్తుగా పోలీసు అరెస్టు చేశారు.

మిర్యాలగూడ : జిల్లా సాధన సమితి సభ్యుల అరెస్టు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులను ముందస్తుగా పోలీసు అరెస్టు చేశారు.

మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ గత రెండు సంవత్సరాలుగా శాంతియుతంగా ఉద్యమిస్తున్న జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులను ముఖ్యమంత్రి మిర్యాలగూడ పర్యటన సందర్భంగా అరెస్ట్ చేయడం అన్యాయమని జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ జాడి రాజు, మాల మహనాడు జాతీయ అధ్యక్షులు తాళ్ళపల్లి రవి లు అన్నారు.

ALSO READ : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. కలకలం..!

మంగళవారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు ప్రజలందరి కోరిక అని రెండు సంవత్సరాల నుండి ఉద్యమిస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి మిర్యాలగూడ పర్యటన సందర్భంగా జిల్లా ప్రకటన చేయాలని డిమండ్ చేశారు.

ఆక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జిల్లా సాధన సమితి నాయకులను మిర్యాలగూడ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అనంతరం త్రిపురరాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మాడ్గుల శ్రీనివాస్, వజ్జగిరి అంజయ్య, మచ్చ ఏడుకొండల్, సైధానాయక్, మురళీ, కుతుబుద్దిన్, దుర్గా ప్రసాద్ తదితరులున్నారు.

ALSO READ : KCR : గన్ మెన్ కు దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఎందుకో తెలుసా..!