ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. కలకలం..!

ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ ఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. కలకలం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ ఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓం సాయి నగర్ కాలనీకి చెందిన కృష్ణవేణి, ఆనంద్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వైభవ్ (16) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. రెండవ కుమారుడు ఏడవ తరగతి చదువుతున్నాడు.

వైభవ్ కు పదవ తరగతి లోను 8.3 మార్కులు వచ్చాయి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తీవ్రత చేస్తున్న కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి మంగళవారం ఉదయం చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ALSO READ : BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!

సూసైడ్ నోట్ లో ఏముంది..?

వైభవ్ అని నేను చైతన్యపురిలోని నారాయణ కళాశాలలో చదువుతున్నాను. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కళాశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ , వైస్ ప్రిన్సిపల్ టార్చర్ పెడుతున్నారు. నా సోదరుని ఎట్టి పరిస్థితులను నారాయణ కాలేజీలో చేర్చవద్దు.

నా జీవితంలో ఇదే చివరి రోజు. విద్యార్థులను తీవ్ర వత్తిడికి గురి చేయకండి. నా సోదరుడు మంచి కాలేజీలో చేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. అతని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. సారీ మమ్మీ.. డాడీ.. సోదరా.. సారి టు ఆల్ అని ఆంగ్లంలో సూసైడ్ నోట్ లెటర్ రాశారు. ఇక ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన మీరు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారింది.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!