కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటుంది, బి.ఆర్.ఎస్ తోనే అభివృద్ధి , సంక్షేమం

కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటుంది, బి.ఆర్.ఎస్ తోనే అభివృద్ధి , సంక్షేమం

వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు

మిర్యాలగూడ, మన సాక్షి :

బి.ఆర్.ఎస్ హయంలోని మిర్యాలగూడ దశా.. దిశ… మారిందని, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కృషితో 4,500 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు , అభివృద్ధి పనులతో ఎంతగానో అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్ర వారం మిర్యాలగూడ పట్టణ బీ.ఆర్.ఎస్ ఆత్మీయ సమ్మేళనం సంబురంగా సాగింది.

 

ముందుగా వేములపల్లిలో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం ఏరియా ఆసుపత్రిలో వంద పడకల భవన నిర్మాణానికి శంకుస్థాపన అభివృద్ధి పనులను, ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్ ఎస్ పి క్యాంపు మైదానం నందు ఏర్పాటు చేసిన పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే మిర్యాలగూడ ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. 4 వేల 500 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా సి.సి రహదారులు, బి.టి రహదారులు, తాగునీరు, పెన్షన్లు, సంక్షేమ ఆర్థిక విధానాలతో 9 ఏళ్లలో ఎంతో గాను అభివృద్ధి చెందింది అన్నారు.

 

మిర్యాలగూడలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 16కోట్లతో 200 పడకల ఆసుపత్రి, భవనం, చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డు వంటి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

అబద్దాలు అవాస్తవాల ప్రచారంతో కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ 10ఎండ్లల్లో 6000 ఉద్యోగాలు ఇస్తే కె.సి.ఆర్ తొమ్మిదేళ్లల్లో 1.54 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సమస్యలతో కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

 


కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకపోగా నేడు నల్గొండ, సూర్యపేట లో మెడికల్ కళాశాలలో నల్లగొండలో బత్తాయి మార్కెట్, నకిరేకల్లో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నామన్నారు, మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలతీతంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందింది అన్నారు.

 

40 వేల కోట్లతో నిర్మితమవుతున్న యాదాద్రి పవర్ ప్లాంట్ తో మిర్యాలగూడ, దామరచర్ల ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో తాగు సాగునీటి సమస్యలు, పరిష్కారమయ్యాయి.

 

ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ 9 సంవత్సరాల బీ.ఆర్.ఎస్ హయాంలో మిర్యాలగూడ ఎంతగానో అభివృద్ధి చెందిందని. సంక్షేమ పథకాలు అభివృద్ధి విధానాలతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. నియోజకవర్గంలో కొత్త మండలాలు కొత్త గ్రామపంచాయతీలతో ఎంతగానో అభివృద్ధి చెందింది. వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు మిర్యాలగూడ ఆసుపత్రికి టిఫ స్కానింగ్, సిటీ స్కాన్, బ్లడ్ బ్యాంక్ వంటి వైద్య సేవలు సౌకర్యాలు కల్పించాలని మంత్రిని కోరారు.

 

అభివృద్ధికి చేయూతనిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను బి.ఆర్.ఎస్ విజయ సాధిస్తుందని భాస్కర్ రావు అన్నారు.

 

అనంతరం మిర్యాలగూడ పట్టణం 6వ వార్డు-ఇందిరమ్మ కాలనీ నందు 25 లక్షలతో నిర్మితమైన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషద్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, రమావత్ రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపుడి సైదిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, పాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల రైతు బంధు సమితి సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్, మండల పార్టీ అద్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎం.పి.టి.సి లు, బి.ఆర్.యస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.