కేటీఆర్ తో మిర్యాలగూడ జిల్లా ప్రకటన చేయించాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు..!

కేటీఆర్ తో మిర్యాలగూడ జిల్లా ప్రకటన చేయించాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరోసారి నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి( బి ఎల్ ఆర్) పిలుపునిచ్చారు.

మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాదన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఆరో రోజు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజారుద్దీన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలో కూర్చోవడం జరిగినది. ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

అనంతరం భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడను జిల్లా చేసే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. మిర్యాలగూడ జిల్లా చేసే విషయంలో తాను కృషి చేస్తున్న అని పేర్కొంటున్న ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాలగూడకు రానున్న మంత్రి కేటీఆర్ తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

మిర్యాలగూడ జిల్లా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమడబోయిన అర్జున్, పొదిల శ్రీనివాస్,బెజ్జం సాయి, కౌన్సిలర్ జానీ, అబ్దుల్లా, పొలగాని వెంకటేశ్వర్లు, పాల్గొనగా దీక్షలో యువజన విభాగం నాయకులు కిషన్ నాయక్ ,చంటి, అశోక్, జమీర్, సతీష్ నాయుడు,

బాలాజీ నాయక్, యూసుఫ్, సందీప్ నాయుడు, కూర్చోగా జిల్లా సాధన సమితి నాయకులు డాక్టర్ రాజు, జయరాజు, కొల సైదులు, జ్వాల వెంకటేశ్వర్లు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Cm BreakFast : సీఎం బ్రేక్ ఫాస్ట్ నియోజకవర్గానికి ఒకే పాఠశాల.. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం..!

పలు సంఘాల మద్దతు:

మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఆరో రోజుకు చేరగా దీక్షలకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు సిపిఐ నేతలు ధనుంజయ నాయుడు, చిలకరాజు శ్రీను ,అంబటి బిక్షం, క్లాత్ మార్చేంట్ అసోసియేషన్ అధ్యక్షులు నీలా మోహన్ రావు, ప్రసాద్ రావు, ప్రసాద్ కిషన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడలో 10న కేటీఆర్ పర్యటన.. అధికారులతో ఎమ్మెల్యే కీలక సమావేశం..!