క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్టు..!

నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యుల గుట్టు రట్టయింది. ఐదుగురు నకిలీ వైద్యులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వివరించిన వివరాల ప్రకారం..

Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్టు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యుల గుట్టు రట్టయింది. ఐదుగురు నకిలీ వైద్యులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వివరించిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైద్య బృందం ప్రైవేట్ ఆస్పత్రులు తనిఖీ చేసి అర్హత లేని ఆసుపత్రుల వైద్యుల నివేదికలను అందజేశారు. దాంతో ఆ నివేదిక ఆధారంగా ఐదుగురు పజ్జురి వికాస్ కుమార్, వలికి శ్రీను, పెమ్మి వెంకటేష్, బనావత్ శివ కోటేశ్వరరావు, గడ్డం నాగరాజు లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పక్కన పజ్జురి వికాస్ కుమార్ అనే వ్యక్తి డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి 2007 – 2009 వరకు హైదరాబాదులోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో డిప్లమా ఇన్ ఆప్తమా అసిస్టెంట్ కోర్సు చదివాడు. అనంతరం హైదరాబాద్ బ్రాండ్ ఐ క్లినిక్ లో, శ్రీ నేత్రాలయం ఆసుపత్రిలో ఆప్తమాలిక్ అసిస్టెంట్ గా ఐదు సంవత్సరాలపాటు పనిచేశాడు.

ఆ తర్వాత మిర్యాలగూడ హనుమాన్ ఐ క్లినిక్ లో కూడా ఆరు సంవత్సరాల పాటు పనిచేసి తనే ఆప్తమాలజిస్ట్ గా రోగులకు చికిత్స చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చునని శ్రీ మహాలక్ష్మి కంటి ఆసుపత్రిని 2021 లో ఏర్పాటు చేశాడు. ఆప్తమాలజిస్ట్ వద్ద అసిస్టెంట్ గా ఉండే అర్హత మాత్రమే ఉన్నప్పటికీ ప్రజలను నమ్మించుటకు ఆసుపత్రిలో స్పెషలిస్ట్ ఆప్తమాలజిస్ట్ కన్సల్టెంట్ గా నియమించుకొని అతని పేరుమీద ప్రిస్క్రిప్షన్లు ప్రింట్ లు చేయించి ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స చేస్తున్నట్లు నమ్మించాడు. ఆసుపత్రికి వచ్చే అందరికీ నేనే అత్తమాలజిస్ట్ అని చికిత్స చేస్తున్నారు.

ALSO READ : Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు.. క్యాబినెట్ లో చర్చించారా..?

హౌసింగ్ బోర్డు కు చెందిన బైరెడ్డి పద్మ అనే మహిళ జూన్ 8 2025లో ఆసుపత్రికి వచ్చింది. ఆమె కుడి కన్నుకు పరీక్షించి కంటి లో చుక్క ఉన్నదని కుడి కన్నుకు సర్జరీ చేయాలని తనే నిర్ణయించి డాక్టర్ ను పిలిపించి అతనితో అన్ని టెస్టులు అయిపోయినవి సర్జరీ కచ్చితంగా చేయాలని చెప్పి సర్జరీ చేయించాడు. సర్జరీ అనంతరం ఆమె హాస్పిటల్ కు వచ్చి కుడి కన్ను పూర్తిగా కనపడకుండా పోయిందని చెప్పగా డాక్టర్ కు తెలియకుండానే తనే ప్రిస్క్రిప్షన్ పై కొన్ని మందులు రాసి ఇచ్చాడని దాంతో కంటిచూపు మందగించింది.

అదే విధంగా మూడు నెలల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సైతం తనిఖీలు చేసి కొన్ని కంటి ఆసుపత్రులు శ్రీ మహాలక్ష్మి, శాలిని కంటి ఆసుపత్రి, యశస్వి కంటి ఆసుపత్రి, అన్నపూర్ణ కంటి ఆసుపత్రి, రఫా ఐ క్లినిక్లను తనిఖీ చేశారు. వారంతా ఆప్తమాలజిస్టులు కాదని అర్హతలు లేవని కేసులు పెట్టారు. కాగా మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు దర్యాప్తు చేసి అర్హతలేకున్న డాక్టర్ అని చెప్పుకొని వైద్యం చేస్తున్న పజూరి వికాస్ కుమార్ ని అరెస్టు చేశారు. ఇతడిది వేములపల్లి మండలం రావులపెంట గ్రామమని పేర్కొన్నారు. అతనితోపాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కేసును చేదించిన ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, ఎస్ఐ సైదిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ వీరబాబు, నరసింహ, ప్రసాద్ లను డి.ఎస్.పి అభినందించారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ సోమ నరసయ్య ఎస్సై రాంబాబు సమావేశంలో ఉన్నారు.

MOST READ : 

  1. Hyderabad : హైదరాబాదులో దారుణం.. రెండు నెలల శిశువు కాళ్లు, చేతులు కట్టేసి పొయ్యిలో పడేసి హత్య చేసిన కన్నతల్లి..!
  2. District Collector : ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
  3. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. చెల్లింపులు మరింత ఈజీ.. లేటెస్ట్ అప్డేట్..!
  4. Miryalaguda : పూజలు, మంత్రాల పేరుతో ఘరానా మోసం.. ఆమాయక ప్రజలే టార్గెట్..!

మరిన్ని వార్తలు