మిర్యాలగూడ : 19న ఉచిత క్యాన్సర్ , కిడ్నీ, గుండె వైద్య శిబిరం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో ఉచితంగా క్యాన్సర్, కిడ్నీ, గుండె వైద్య శిబిరం ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్నాటి రమేష్ పేర్కొన్నారు.

మిర్యాలగూడ : 19న ఉచిత క్యాన్సర్ , కిడ్నీ, గుండె వైద్య శిబిరం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో ఉచితంగా క్యాన్సర్, కిడ్నీ, గుండె వైద్య శిబిరం ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్నాటి రమేష్ పేర్కొన్నారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక వర్షిత హాస్పిటల్ లో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య శిబిర ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జిల్లా వైద్యాధికారి కొండలరావు హాజరవుతారని తెలిపారు.

ALSO READ : Online app : ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొచ్చా.. నల్గొండ జిల్లా యస్.పి చందనా దీప్తి ఏం చెప్పారో చూడండి..!

ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని, ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ కార్యదర్శి లింగయ్య, కోశాధికారి బాబురావు, సీనియర్ లైన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ కే ఎన్ ప్రసాద్, ముక్కపాటి వెంకటేశ్వరరావు, రవీందర్ రెడ్డి , డాక్టర్ రాజు , మా శెట్టి శ్రీనివాస్ , నాయుడు , వర్షిత హాస్పిటల్ యాజమాన్యం రాంబాబు పాల్గొన్నారు.

ALSO READ : Nalgonda : సమస్యల పరిష్కారానికి వెంటనే ఫోన్ లోనే ఆదేశాలు జారీ చసిన మంత్రి కోమటిరెడ్డి..!