మిర్యాలగూడలో తలుక్కుమన్న అందాల తార..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వస్త్ర ప్రపంచం సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ఆదివారం అందాల తార, సినీ హీరోయిన్ రాశి ఖన్నా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి ప్రారంభించారు.

మిర్యాలగూడలో తలుక్కుమన్న అందాల తార..!

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వస్త్ర ప్రపంచం సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ఆదివారం అందాల తార, సినీ హీరోయిన్ రాశి ఖన్నా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఆమెను చూసేందుకు పట్టణ, పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

సాగర్ రోడ్డు కిటకిటలాడింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభానికి ముందు అభిమానులకు రాశిఖన్నా అభివాదాలు తెలిపారు. అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ఆదరించాలని ఆమె కోరారు. అనంతరం సంస్థ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా వస్త్ర వ్యాపార రంగంలో నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రజలు సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆదరించాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి బృందం, జబర్దస్త్ బృందం ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, స్థానిక కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి శ్యామ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, ఫణిందర్ తదితరులు పాల్గొన్నారు.