Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఘోరం.. అనుమానాస్పదంగా తల్లి, కూతుళ్లు మృతి..!

Miryalaguda : మిర్యాలగూడలో ఘోరం.. అనుమానాస్పదంగా తల్లి, కూతుళ్లు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లి, కూతుళ్లు మృతిచెందగా మరో కుమార్తె అపస్మారక స్థితిలో ఉంది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గొంతు కోసిన గాయాలతో కూతురు మృతి చెందగా ఉరివేసుకొని తల్లి మృతి చెందింది. వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం కు చెందిన గుర్ర సీతారాంరెడ్డి, అతని భార్య రాజేశ్వరి గత కొద్ది రోజులుగా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. సీతారామరెడ్డి ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్ గా పని చేస్తూ గత రెండు రోజులుగా ఊరికి వెళ్లి శనివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే భార్య రాజేశ్వరి ఉరివేసుకుని చిన్న కూతురు వేదశ్రీ గొంతు కోసిన గాయాలతో పడి మృతి చెంది ఉంది.

అదేవిధంగా తన పెద్ద కూతురు అపస్మారక స్థితిలో ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి సంబంధించిన వివరాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న కూతురు కోలుకున్న తర్వాత అసలు విషయం ఏం జరిగిందనేది బయటకు తెలిసే అవకాశం ఉంది.

MOST READ : 

  1. Narayanpet : భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ఏర్పాటు..!

  2. Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

  3. Nalgonda : కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య.. ఉలిక్కిపడిన నల్లగొండ..!

  4. Students: భారత్, యూకే విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక ఒప్పందంపై సంతకం..!

మరిన్ని వార్తలు