Miryalaguda : శాగ జలంధర్ రెడ్డి, జయలక్ష్మి దంపతులను గెలిపించాలి..!
మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుందని స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు.

Miryalaguda : శాగ జలంధర్ రెడ్డి, జయలక్ష్మి దంపతులను గెలిపించాలి..!
ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారం
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుందని స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. శనివారం పట్టణంలోని రెండవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 2 వ వార్డు అభ్యర్థి శాగ జయలక్ష్మిని గెలిపించాలని, 13వ వార్డులో శాగ జలేందర్ రెడ్డిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
శాగ జలేందర్ రెడ్డి, జయలక్ష్మి దంపతులు అభివృద్ధిని కాంక్షించే వారని, వారి విజయంతో పేదలందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతుందని, పేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ తో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రజా పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని వారు కోరారు.
MOST READ
-
నల్గొండ జిల్లాలో మద్యం మత్తులో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. గ్రామస్తుల దేహశుద్ధి..!
-
TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!
-
Miryalaguda : NSP క్యాంపులో ధన బలంతో వచ్చే వారికి ఓటుతో సమాధానం ఇవ్వండి..!
-
District Collector : భూభారతిపై నల్గొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రత్యక్షంగా పరిశీలన..!










