Miryalaguda : మిర్యాలగూడ రైతు వేదికలో రేపు విత్తన మేళా..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల రైతాంగానికి ఈ నెల 23న ఉదయం 10:30 గంటలకు మిర్యాలగూడ రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించబడుతుందని మండల వ్యవసాయాధికారి ఈ. ఎం.ఋష్యేంద్రమణి ఒక ప్రకటనలో తెలిపారు.

Miryalaguda : మిర్యాలగూడ రైతు వేదికలో రేపు విత్తన మేళా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల రైతాంగానికి ఈ నెల 23న ఉదయం 10:30 గంటలకు మిర్యాలగూడ రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించబడుతుందని మండల వ్యవసాయాధికారి ఈ.
ఎం.ఋష్యేంద్రమణి ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన మేళాలో వ్యవసాయ అవసరాల కోసం విత్తనాలు, ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రభుత్వం సిఫారసు చేసిన 8 సన్న రకాల వరి విత్తనాలు, పప్పు దినుసుల విత్తనాలు,
నూనె గింజల విత్తనాలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డి.ఏ.పీ
రైతు సోదరులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమకు అవసరమైన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తులను పొందాలన్నారు. ఈ నెల 23 నుండి 30 వరకు మిర్యాలగూడ రైతు వేదికలో విత్తన మేళా జరుగుతుందన్నారు.
విత్తన మేళాలో సన్న వడ్లు విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డిఏపి లు లభ్యమవుతాయన్నారు. రైతులు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేళాలో మిర్యాలగూడ అసిస్టెంట్ డైరెక్టర్ కె. జగదీశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొంటారని తెలిపారు.









