Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ పై ఎగిరే జెండా.. అభివృద్ధే ఎజెండా, గెలుపెవరిది..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఈ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ పై ఎగిరే జెండా.. అభివృద్ధే ఎజెండా, గెలుపెవరిది..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఈ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మున్సిపాలిటీలోని 48 వార్డులలో అత్యధిక వార్డులు కైవసం చేసుకుని మున్సిపాలిటీ పై జెండా ఎగరవేసేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల్లో అభివృద్ధి హామీలను ఆయా పార్టీలో ఎజెండాగా తీసుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఎజెండగా భావిస్తున్నాయి. అభివృద్ధితో పాటు ఆయా పార్టీలు ఇచ్చే హామీలపై ఓటర్లు ఎదురుచూస్తున్నారు.
సోమవారం సాయంత్రం తో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఇక ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ ఎన్నికల్లో 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్.. సిపిఎంతో జతకట్టి పోటీలోకి దిగింది. తాము ఒంటరిగా పోటీ చేసి మున్సిపల్ పీఠం దక్కించుకోగలమని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుండగా, సిపిఎంతో జతకట్టడం తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని బీఆర్ఎస్ మున్సిపల్ పీఠం దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు ఉద్యమ వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండగా 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఇటీవల మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ప్రకటించారు. ప్రతి గల్లీలో సిసి రోడ్లు, ఇంటింటికి నల్లాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే 400 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి చేపట్టామని ప్రస్తుత ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ప్రకటించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల లోకి వెళ్తున్నాయి. అయితే ఇక ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
MOST READ
-
TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!
-
Municipal Elections : మున్సిపల్ బిగ్ ఫైట్.. మిర్యాలగూడలో కింగ్ మేకర్ ఎవరు..!
-
నల్గొండ జిల్లాలో మద్యం మత్తులో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. గ్రామస్తుల దేహశుద్ధి..!
-
CM Revanth Reddy : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య..!









