బి ఎల్ ఆర్ ప్రమాణ స్వీకారం ఎప్పుడో తెలుసా..!

మిర్యాలగూడ శాసనసభ్యులుగా నూతనంగా ఎన్నికైన బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 9వ తేదీన తెలంగాణ శాసనసభ్యులు 99 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

బి ఎల్ ఆర్ ప్రమాణ స్వీకారం ఎప్పుడో తెలుసా..!
మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ్యులుగా నూతనంగా ఎన్నికైన బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 9వ తేదీన తెలంగాణ శాసనసభ్యులు 99 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

కానీ మిర్యాలగూడ శాసనసభ్యులుగా ఎన్నికైన బట లక్ష్మారెడ్డి ఆరోజు అనివార్య కారణాలవల్ల ప్రమాణ స్వీకారం చేయలేదు. నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పై 50వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

భత్తుల లక్ష్మారెడ్డి కి మాతృవియోగం జరగడం, ఆ తర్వాత వైరల్ ఫీవర్ తో బాధపడటం వల్ల ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ ఈ నెల 14వ తేదీన గురువారం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ALSO READ : BREAKUNG : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలు..!