Narayanpet : జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం..!

నారాయణపేట జిల్లా అభివృద్ధి సమిష్టి కృషితో సాధ్యమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

Narayanpet : జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా అభివృద్ధి సమిష్టి కృషితో సాధ్యమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేటకు కొత్తగా బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ ను మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డీ సీ సీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.