Breaking Newsక్రైంజాతీయంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్.. జైలుకే..!

BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్.. జైలుకే..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. కవితకు 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారం ఉదయం నుంచి కవిత జైలుకా.. ఇంటికా.. అని కుటుంబ సభ్యులు , పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొన్నది. కాగా మధ్యాహ్నం ఉత్కంఠకు తెరపడింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

దాంతో ఆమెకు 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. కవితకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆమెను జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటో తేదీన విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొన్నది. కవితకు జ్యూడిటీషియల్ కస్టడీ విధించడం ఇది మూడవసారి. మొదట వారం రోజులపాటు, మరోసారి మూడు రోజుల పాటు కష్టడీ విధించగా ఇప్పుడు ఏకంగా 14 రోజులపాటు కస్టడీ విధించింది.

ALSO READ : Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు