తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

మిర్యాలగూడ : మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ ఓకే చోట.. సౌకర్యాలు లేక విద్యార్థినిల అవస్థలు, ధర్నా..!

మిర్యాలగూడ : మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ ఓకే చోట.. సౌకర్యాలు లేక విద్యార్థినిల అవస్థలు, ధర్నా..!

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థినిల తమ హాస్టల్ ను, తమకే కేటాయించాలని మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థునిలు ధర్నా నిర్వహించారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థులను వెంటనే వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశారు.

వేములపల్లి మోడల్ స్కూల్లో కస్తూరిబా పాఠశాల విద్యార్థులను చేర్చారు. దాంతో విద్యార్థులు అదనంగా కావడం వల్ల పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేక విద్యార్థినిలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై గతంలో ధర్నా నిర్వహించగా కస్తూరిబా పాఠశాలను వేరే చోటుకు తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో మరోసారి ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ మాకు కేటాయించిన హాస్టల్లో వందమంది విద్యార్థులు ఉండాల్సిన హాస్టల్లో 370 మంది విద్యార్థినిలను ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో బాత్రూంలో సమస్యతో పాటు పడుకోవడానికి ఏడు రూములను మాకు కేటాయించారు. ఆ సమస్యతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని సమస్యను వెంటనే పరీక్షించాలని డిమాండ్ చేశారు.

గత నెల 15న కస్తూర్బా పాఠశాలను తరలిస్తామని హామీ ఇచ్చి అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారుల స్పందించి వెంటనే సమస్యను పరీక్షించాలని కోరుతున్నారు.

కాగా ఎంఈఓ సర్ది చెప్పి పాఠశాలలో తరలిస్తామని తెలిసినప్పటికీ హాస్టల్ ఎస్ ఓ పాఠశాలను తరలించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని విద్యార్థులకు తెలియజేసినట్లు ధర్నాలో కూర్చున్న విద్యార్థులు పలు రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న వెంటనే మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్ విద్యార్థుల దగ్గరికి వచ్చి మీ యొక్క హాస్టల్ సమస్యలను 48 గంటలు గంటల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

LATEST UPDATE : 

చిన్న వయసులో చిట్టి సహాయం..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!

మరిన్ని వార్తలు