Miryalaguda : దోమల నివారణ చేసి విష జ్వరాలను కట్టడి చేయాలి..!
Miryalaguda : దోమల నివారణ చేసి విష జ్వరాలను కట్టడి చేయాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డ్రైనేజ్ సమస్యలు అధికంగా ఉన్న వార్డులో ప్రతిరోజూ శుభ్రపరచాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులతో మిర్యాలగూడ ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పట్టణంలో ఎప్పటికప్పుడు సానిటైజేషన్ చేస్తూ దోమలను పూర్తిగా కట్టడి చేసి డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలను పూర్తిగా కట్టడి చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ కార్యక్రమం, వన మహోత్సవం,78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కమిషనర్ యూసఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, పర్యావరణాధికారి శ్వేత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!
Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!









