ములుగు : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి

ములుగు : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి

ములుగు, మన సాక్షి

ములుగు జిల్లా పరిషత్, చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్, కొద్దిసేపటి, క్రితం గుండెపోటుతో మృతి చెందారు.

 

ఆదివారం, ఉదయం 11 గంటల సమయంలో తన నివాసంలో ఒక్కసారిగా అస్వస్థకు గురైన తనని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.  అజర హాస్పటల్ లో వైద్యం అందిస్తుండగా మృతి  చెందినట్లు వైద్యులు, తెలిపారు.

 

గతంలో కొద్ది నెలల క్రితం కుసుమ జగదీష్ కు ఒకసారి గుండెపోటు వచ్చింది ఇప్పుడు ఆయనకు గుండెపోటు రావడం రెండవసారి.

 

కుసుమ జగదీష్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.  తెలంగాణ ఉద్యమ కాలంలో జగదీష్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు కెసిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  సంతాపం వ్యక్తం చేసిన వారిలో మంగపేట మండల పార్టీ అధ్యక్షుడు కుడుములు లక్ష్మీనారాయణ ఉన్నారు.