మున్సిపల్ కమీషనర్ బదిలీ ఎందుకు …?
- చెప్పాలని బిజెపి పార్టీ కౌన్సిలర్ ల డిమాండ్

మున్సిపల్ కమీషనర్ బదిలీ ఎందుకు …?
– చెప్పాలని బిజెపి పార్టీ కౌన్సిలర్ ల డిమాండ్
సూర్యాపేట, మనసాక్షి : సూర్యాపేట పట్టణంలో ప్రతిపక్ష కౌన్సిలర్ లతో సఖ్యతగా మెలుగుతూ, వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డిని ఆకస్మికంగా బదిలి చేయడం సరైన విధానం కాదని బిజెపి కౌన్సిలర్ లు ,నాయకులు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్ కౌన్సిలర్లు పగిళ్ల సుమిల – గన్నారెడ్డి, సలిగంటి సరిత, పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి అబిద్ లు పాలుగోని వారు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డిని ఎందుకు బదిలీ చేశారో మంత్రి సూర్యాపేట ప్రజలకు సమాధానం చెప్పాలని ,అవినీతి ఆరోపణలు ఉండి గతంలో సక్రమంగా పనిచేయని రామాంజుల రెడ్డిని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గా ఎందుకు తీసుకువస్తున్నారో మంత్రి సూర్యాపేట ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏ తప్పు చేశాడని మున్సిపల్ కమిషనర్ ని బదిలీ చేశారని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చి బదిలీ చేసినట్లయితే మునిసిపాలిటీలో ప్రతి పనిని సిండికేట్ చేసి అవినీతికి పాల్పడే రామాoజుల రెడ్డిని ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు.
గతంలో సూర్యాపేటలో మూడు సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి సూర్యాపేట చుట్టూ అవినీతి సొమ్ముతో భూములు కొనుక్కున్నారని అన్నారు. రామాంజుల రెడ్డి ప్రభుత్వ అధికారులకు కానీ, మున్సిపాలిటీ కౌన్సిలర్లకు కానీ, పట్టణ ప్రజలకు కానీ ఎవరికి విలువ ఇచ్చేవారు కాదని, అలాంటి వ్యక్తిని మళ్లీ తిరిగి మున్సిపల్ కమిషనర్ గా ఎందుకు తీసుకువచ్చారో తేవడం లేదన్నారు. రామంజరెడ్డి అవినీతిలో మంత్రికి కూడా సంబంధం ఉందని ఈ సంఘటనతో తేటలెల్లమ్ అయుందన్నారు. కమిషనర్ బదిలీ ఎందుకు చేశారో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.