Miryalaguda : నిద్ర మత్తులో మున్సిపల్ కమిషనర్.. మేలుకొలుపుతున్న సామాజికవేత్తలు..!
Miryalaguda : నిద్ర మత్తులో మున్సిపల్ కమిషనర్.. మేలుకొలుపుతున్న సామాజికవేత్తలు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
గ్రేడ్ వన్ మిర్యాలగూడ మున్సిపాలిటీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండే మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదుదారులపై చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ, ఈ ఆఫీసు నా సొంతం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజలను తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షులు సరికొండ రిషికేశ్వర రాజు , చిలుముల కొండలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు,
మున్సిపల్ కమిషనర్ తన ముందు ఉన్నటువంటి ఆఫీస్ టేబుల్ పై తన రెండు కాళ్ళను చాపి తన విధులను మరచి నిద్రపోతున్న ఫోటో ఈరోజు వివిధ వార్తాపత్రికలలో రావడం ఎంతో దురదృష్టకరమని తెలియజేశారు, ఈ కమిషనర్ పై ప్రజలలో ఇప్పటికే అసహనం అసంతృప్తి పెరిగిందని తెలియజేశారు, కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్నటువంటి ఫిర్యాదుదారులని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య పూరితమైన వ్యవహారాశాలిని తప్పుపట్టారు,
జిల్లా కలెక్టర్ మరియు సిడిఎంఏ కమిషనర్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి వెంటనే ఈ కమిషనర్ ని విధులనుంది తొలగించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో దేవులపల్లి కార్తీక్ రాజు, స.హ.చ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు మచ్చ మధుకర్, డివిజన్ ఉపాధ్యక్షులు మంద శేఖర్, గణేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
KTR : కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డు.. ఎందుకు పోస్ట్ చేశాడబ్బా.. తెలుసుకుందాం..!
Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!









