తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు
Municipal Elections : మున్సిపల్ ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మిక తనిఖీ.. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కీలక ఆదేశాలు..!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.జితేందర్ రెడ్డి తనిఖీ చేశారు.

Municipal Elections : మున్సిపల్ ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మిక తనిఖీ.. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కీలక ఆదేశాలు..!
కరీంనగర్, మనసాక్షి:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.జితేందర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ లో ఏర్పాట్లు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా వచ్చిన వార్త క్లిప్పింగ్ లను సేకరించి తగు చర్యకై పంపించాలని అన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లుగా కాల్ సెంటర్ కి వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేయాలని, సంబంధిత నోడల్ అధికారికి తెలియపరచాలని ఆదేశించారు. ఎంసీసీ ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను +918782997247 లో నెంబర్ కు ఫోన్ ద్వారా చేయవచ్చని సూచించారు. ఆడిట్ అబ్జర్వర్ ఎం.మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
MOST READ
-
District Collector : భూభారతిపై నల్గొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రత్యక్షంగా పరిశీలన..!
-
TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
Nalgonda : ఎన్.జి కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్..!
-
ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!









