జాతీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjuna Sagar : బుద్ధ వనం సందర్శించిన శ్రీలంక మంత్రి.. ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు..!

నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని శనివారం నాడు ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు సందర్శించారు.

Nagarjuna Sagar : బుద్ధ వనం సందర్శించిన శ్రీలంక మంత్రి.. ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని శనివారం నాడు ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు సందర్శించారు. హైదరాబాదులో నిర్వహించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంక బుద్ధ శాసన మత సాంస్కృతిక శాఖ మంత్రి హెనిడుమ సునీల్ సెనెవి విజయ విహార్ అతివృహానికి చేరుకోగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, టూరిజం హోటల్స్ జనరల్ మేనేజర్ నాదన్, మిర్యాలగూడ డి. ఎస్. పి రాజశేఖర్ రాజు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం 22 దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, బౌద్ధ భిక్షువులు, బౌద్ధ నిపుణులు బుద్ధవనం చేరుకోగా ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులకు టిబెట్ సంప్రదాయ పద్ధతిలో వాయిద్యాలతో స్వాగతం పలికారు. బుద్ధ వనములో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలు ఘటించిన అనంతరం మహాస్తూపం లోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించిన అనంతరం పలు దేశాలకు చెందిన బౌద్ధ సంప్రదాయ పద్ధతిలో చాటింగ్ చేస్తూ ధ్యానం చేశారు.

అనంతరం తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునకొండ మ్యూజియం చేరుకోగా మ్యూజియం క్యూరేటర్ కమలహాసన్ ఈ బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. నాగార్జున కొండపై పునర్ నిర్మించిన అశ్వమేధ యజ్ఞశాల, గౌతమ బుద్ధుని ధాతువులు లభ్యమైన మహాస్తూపము, శ్రీలంక దేశానికి సంబంధించిన సింహల విహారము ను సందర్శించారు. నాగార్జునకొండ మ్యూజియంలో నాగార్జునకొండ మ్యూజియం లో బుద్ధ ధాతువులను దర్శనం చేసుకుని వందనం చేసుకున్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు,నాగార్జున కొండ, బుద్దవనం విశేషాలను వివరించారు.

ఈ సందర్భంగా శ్రీలంక మంత్రి హెనిడుమ సునీల్ సెనేవి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న యుద్ధ వాతావరణం లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బుద్దవనం నిర్వహించిన సదస్సు ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వడం ఆ సదస్సులో తాను పాల్గొనడం నిజముగా తనకెంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

యుద్ధ సమయంలో ఇటువంటి శాంతి సదస్సులు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. భారతదేశానికి శ్రీలంకకు గతంలోనే మైత్రి సంబంధాలు ఉన్నాయని వాటిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రముఖ బౌద్ధ గురువు వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షులు తోచ్ నట్, గగనమాలిక్ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య చెరువతో ఇటువంటి శాంతి సదస్సు ద్వారా భవిష్యత్తులో ఎంతో మార్పు రాగలదని ఆకాంక్షించారు.

వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ టూరిజం మాజీ సీ ఎం డి,బుద్ధవనం గైడర్ చెన్నూరు ఆంజనేయ రెడ్డి, తెలంగాణ టూరిజం ఏజీఎం జంగయ్య, పెద్ద ఊర తాసిల్దార్ శ్రీదేవి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్దవనం ఆర్ట్స్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యామసుందర్రావు తదితరులు ఉన్నారు. ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధుల సాగర్ సందర్శన సందర్భంగా సాగర్ సిఐ శ్రీను నాయక్, హాలియా సీఐ సతీష్ ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లను చేశారు.

మరిన్ని వార్తలు