విజేతలకు బహుమతులు అందజేసిన స్వామీ నాయక్

సంక్రాంతి ముగ్గులలో పాల్గొన్న స్వామీ నాయక్
నల్గొండ, మన సాక్షి:
నాగార్జున పేట తండాలో న్యూ నాగార్జున పేట యూత్ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జి రమావత్ స్వామి నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి నాయక్ గారు మాట్లాడుతూ..
ముగ్గులు వేయడం ఒక కళ అని, ఇలాంటి కళ వలన మన సంస్కృతి, సాంప్రదాయాలు గౌరవించబడుతాయన్నారు. ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్నవారికి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల YSRTP అధ్యక్షుడు రంగా నాయక్, మండల యూత్ అధ్యక్షుడు హనుమానాయక్, రవి నాయక్, ధనుకోటి నాయక్ వచ్చనాయక్, అంగోతు స్వామి నాయక్, అంగోతు వెంకటేశ్వర్లు, రమావత్ రవి నాయక్, గ్రామంలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు