Nagarjunasagar : నాగార్జునసాగర్ 6 గేట్లు ఎత్తి నీటి విడుదల.. కృష్ణమ్మ పరవళ్ళు.. Latest Update

Nagarjunasagar : నాగార్జునసాగర్ 6 గేట్లు ఎత్తి నీటి విడుదల.. కృష్ణమ్మ పరవళ్ళు.. Latest Update
మన సాక్షి, నాగార్జునసాగర్ :
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు తెచ్చుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరదరావడంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం సాగర్ ప్రాజెక్టుకు ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. భారీగా జలాశయంకు నీరు వచ్చి చేరుతుండడంతో మరికొన్ని గేట్లు కూడా తెరవనున్నారు. కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి.
అలమట్టి డ్యాం నుంచి శ్రీశైలం డ్యాం వరకు కూడా పూర్తిస్థాయిలో నిండాయి. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. జలాశయంలో 590 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం క గాను ప్రస్తుతం 585.40 అడుగుల నీరు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 284 నీరు ఉంది.
భారీగా వరద :
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 4.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం నుంచి సాగర్ జలాశయంలోకి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు సాంప్రదాయం ప్రకారం కృష్ణమ్మకు జల హారతి పూజలు నిర్వహించి నాగార్జునసాగర్ ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ముందస్తుగా గేట్లు ఎత్తే సమాచారం తెలుసుకున్న పలువురు పర్యాటకులు సాగర్ కు భారీగా చేరుకున్నారు.
ALSO READ :
Nagarjunasagar : తెరుచుకున్న నాగార్జునసాగర్ గేట్లు.. 6 గేట్ల ద్వారా నీటి విడుదల.. Latest Update
Nagarjunasagar : తెరుచుకున్న సాగర్ గేట్లు.. నిండుగా కాలువలు.. పంట పొలాల్లో రైతుల సందడి..!
Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!
WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక లవర్స్ సేఫ్..!
Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)









