TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjunasagar : సాగర్ కి పోటెత్తిన టూరిస్టులు.. కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు..!

Nagarjunasagar : సాగర్ కి పోటెత్తిన టూరిస్టులు.. కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు..!

సాగర్ డ్యాం గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నీటి పారుదల శాఖ అధికారులు

శని ఆదివారాలు సెలవు కావటంతో భారీగా కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు తరలివచ్చిన టూరిస్టులు

 భారీగా స్తంభించిన ట్రాఫిక్

పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు

నిలిచిపోయిన టూరిజం లాంచిలు….

నిరాశలో సాగర్ సందర్శకులు..

నాగార్జునసాగర్, మన సాక్షి :

గత పది రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ బేసిన్ రిజర్వాయర్లు అన్ని నిండుకుండలా మారి నాగార్జునసాగర్ డ్యాం 26 గట్స్ తెరిచి దిగువకు నీటిని విడుస్తున్న ఎన్ఎస్పి అధికారు లు ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఓపెన్ చేయడంతో పర్యాటకులు తాకిడి పెరిగిందనే చెప్పవచ్చు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో శనివారం రోజు సాగర్ లో పర్యాటకుల సందడి మరింతగా పెరిగి వాహనాలు రాకపోకలకు ఇబ్బంది వాటిల్లింది.

భారీగా తరలివచ్చిన పర్యాటకులకు భద్రత పరిరక్షణ అంతా పోలీస్ యంత్రాంగమే చూసుకున్నపటికి పర్యాటకులు మాత్రం అసౌకర్యానికి గురయ్యారని చెప్పకనే చెప్పవచ్చు అటు హోటల్స్ లో భోజనం వసతి లేక మున్సిపల్ రెవెన్యూ శాఖ వారు వచ్చిన పర్యాటకులు కనీసం మంచినీరు కానీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు వచ్చిన పర్యాటకులు మహిళలు మల విసర్జనకు బహిరంగ ప్రదేశాలకి వెళ్లవలసిన పరిస్థితి నెలకొని ఉన్నది ఇదిలా ఉండగా నిలిచిపోయిన టూరిజం లాంచిలు పర్యాటకులకు
నిరాశలో మిగిల్చింద నాగార్జునసాగర్ నుండి నాగార్జునకొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం లాంచీలను శనివారం నుండి నిలిపివేశారు.

దీంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జున కొండను సందర్శించే అవకాశం లేక ఒకవైపు, కనీసం జాలి ట్రిప్పులో సాగర్ జలాశయంలో విహరించే అవకాశం లేక మరోవైపు నిరాశలకు గురయ్యారు. శనివారం నాడు ఉన్నతాధికారులు టూరిజం లాంచీలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారని స్థానిక బోటింగ్ పాయింట్ అధికారులు లాంచీలను నాగార్జున కొండకు తిప్పకుండా నిలిపివేశారు. సాగర్ డ్యాం జల విన్యాసాలను చూసిన సందర్శకులు లాంచీలో విహరించుదామని గంటల తరబడి బోటింగ్ పాయింట్ వద్ద ఎదురు చూశారు. ఎంతసేపటికి తెలంగాణ టూరిజం లాంచీలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో సంబంధిత టూరిజం అధికారులను తిట్టుకుంటూ నిరాశతో వెనుతిరిగారు.

అయితే నాగార్జునసాగర్ తెలంగాణ వైపు నుండి నాగార్జున కొండకు వెళ్లే తెలంగాణ టూరిజం లాంచీలను నిలిపివేసిన విషయంలో తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిడ్ జనరల్ మేనేజర్ ఇబ్రహీంను వివరణ కోరగా నాగార్జునసాగర్ డ్యామ్ ఉన్నతాధికారుల నుండి తమకు తెలంగాణ టూరిజం లాంచిలను తాము చెప్పేంతవరకు తిప్పకూడదని శ్రీశైలం నుండి అధిక మొత్తంలో వరదనీరు వస్తున్న కారణంగా పర్యాటకుల భద్రత దృశ్య లాంచీల రాకపోకలను సాగర్ జలాశయంలో నిలిపివేయాలని తెలిపారని ఈ కారణంగానే కొన్ని రోజులు పాటు తెలంగాణ టూరిజం లాంచిలను సాగర్ జలాశయంలో తిరగకుండా నిలిపివేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ టూరిజం లాంచిలను నిలిపివేసిన కారణంగా లక్షల రూపాయల్లో తెలంగాణ టూరిజo ఆదాయానికి గండిపడిన పర్యాటకుల భద్రత దృశ్య ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

అయితే సాగర్ జలాశయంలో తెలంగాణ టూరిజం లాంచీల రాకపోకలు నిలిపివేసిన ఆంధ్ర ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు తమ లాంచీలను యదేచ్ఛగా నాగార్జున కొండకు శనివారం నాడు నడిపించడం గమనించదగినది. శని ,ఆదివారాలు తో పాటు వరుసగా సెలవు రావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సాగరుకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో తెలంగాణ టూరిజం లాంచ్ లను నిలిపివేయడంపై పలువురు విమర్శిస్తున్నారు.

 

శనివారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటి సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, 587.30 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, 305.6838 టీఎంసీల నిల్వ ఉంది 22 క్రస్ట్ గేట్లను 5 అడుగులు, 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,29886 దిగువకు విడుదల చేస్తున్నారు. కుడికాల్వ ద్వారా 8144, ఎడమ కాల్వ ద్వారా 8193, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,501, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులతో కలిపి 3,14,544 క్యూసెక్కులను రిలీజ్చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్కు 2,94,003 క్యూసెక్కుల ఇన్ నమోదవుతోంది.

ALSO READ : 

Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

CEIR : ఫోన్ పోయినా దొరికే టెక్నాలజీ.. సీఈఐఆర్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..!

TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!,

మరిన్ని వార్తలు