Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : ఆఖరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు.. చివరి నిమిషంలో పార్టీ మారిన ఆశావాహులు..!

నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికలలో ఆఖరి రోజు శుక్రవారం నాడు భారీగా 582 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 48 వార్డులకు 334 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో కాంగ్రెస్ 143 టిఆర్ఎస్ 134 బిజెపి 123 ఆమ్ ఆద్మీ 1 బీఎస్పీ 4 సిపిఎం నాలుగు ఇండిపెండెంట్ లు 100 ఇతర రిజిస్టర్ పార్టీలు 56 నామినేషన్లు దాఖలు చేశారు.

Nalgonda : ఆఖరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు.. చివరి నిమిషంలో పార్టీ మారిన ఆశావాహులు..!

నల్లగొండ, మనసాక్షి.

నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికలలో ఆఖరి రోజు శుక్రవారం నాడు భారీగా 582 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 48 వార్డులకు 334 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో కాంగ్రెస్ 143 టిఆర్ఎస్ 134 బిజెపి 123 ఆమ్ ఆద్మీ 1 బీఎస్పీ 4 సిపిఎం నాలుగు ఇండిపెండెంట్ లు 100 ఇతర రిజిస్టర్ పార్టీలు 56 నామినేషన్లు దాఖలు చేశారు.

సాయంత్రం ఐదు గంటల లోపల క్యూ లైన్ లో ఉన్న వారి నుండి నామినేషన్లు స్వీకరించారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు నామినేషన్ కు అవసరమైన పత్రాలు తీసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య టిఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి చెక్కిలం వసంత తో పాటు వివిధ వార్డుల నుండి భారీ సంఖ్యలో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలో చెందిన అభ్యర్థులు తమ అనుచరులతో ర్యాలీలు తీస్తూ నినాదాలు చేస్తూ నామినేషన్ కేంద్రాలకు తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు, అయితే నామినేషన్ల పర్వంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి, గత కొన్ని సంవత్సరాలుగా ఒక పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కార్పొరేట్ టికెట్ ఆశించి బంగపడినవారు చివరి నిమిషంలో పార్టీలు మారి కండువాలు మార్చి ఆ పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేశారు.

ఐదో వార్డులో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నల్లగొండఅశోక్ పుట్ట వెంకన్నలు టికెట్ రాకపోవడంతో వెంటనే పార్టీ మార్చి బీఆర్ఎస్లకు వెళ్లి ఆ పార్టీ పైన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 36వ వార్డులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి అది రాకపోవడంతో బిఆర్ఎస్ లోకి మారి మురిచెట్టి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.

అలాగే 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆఁ సించి అది రాకపోవడంతో ఊట్కూరు వెంకటరెడ్డి బిజెపిలో చేరి బిజెపి నుంచి నామినేషన్ వేశారు. 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో గోగుల శ్రీనివాస్ బీజేపీలో చేరి బిజెపి నుండి పోటీ చేశారు. అలాగే సమద్ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో వెంటనే టిఆర్ఎస్ లోకి మారి ఆ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు.

అలాగే జహంగీర్ కాంగ్రెస్ నుండి బంగపడి టిఆర్ఎస్లోకి చేరి అక్కడి నుండి నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీకి పోటీ ఎక్కువ ఉండడంతో తలనొప్పిగా మారి సీనియర్ కార్యకర్తలు సైతం పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. అనేక డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా కూడా కొనసాగింది. ఒక్కొక్క డివిజన్లో నలుగురు నుండి ఆరుగు రు వరకు నామినేషన్లు దాఖలు దాఖలు చేశారు . ఒక్కొక్కరు రెండు నుండి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

MOST READ : 

  1. Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మికంగా తనిఖీ

  2. Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

  3. Medaram : జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం.. కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ..!

  4. KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!

మరిన్ని వార్తలు