Breaking Newsక్రైంతెలంగాణ

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ హత్య కేసులో A2కు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు..!

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ హత్య కేసులో A2కు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో A2 నిందితుడు సుభాష్ శర్మ కు ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. వివరాల ప్రకారం..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన “ప్రణయ్ హత్య కేసు”లో.. తుది తీర్పు సోమవారం వెలువడింది.
SC, ST ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు ఇచ్చారు.
A1 మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు.
A2 సుభాష్ శర్మ,
A3 అస్గర్ అలీ,
A4 అబ్దుల్ భారీ,
A5 కరీం,
A6 శ్రావణ్,(మారుతీ రావు తమ్ముడు),
A7 శివ,
A8 నిజాం.. లకు జీవిత ఖైదు విధించింది.

మొత్తం 1600 పేజీల చార్జి షీట్ దాఖలు చేశారు.

ప్రణయ్ హత్య: sept 14, 2018, 7 నిందితుల రిమాండ్: Sept 18, 2018
చార్జిషీట్ జూన్ 12, 2019 దాఖలు చేశారు.

A-2 సుభాష్ శర్మ మినహా.. మిగతా 7 మందికి 2019 April 28 ఏప్రిల్ 28 బెయిల్ మంజూరు అయింది.
A-1, మారుతీ రావు ఆత్మహత్య: 2020 మార్చి 8, 5 సంవత్సరాల ఐదు నెలల 28 రోజులుగా కొనసాగిన విచారణ మొత్తం 110 సాక్షులుగా చేర్చగా.. 78 సాక్షులుగా కోర్టులో హాజరు కాగా విచారించింది. విచారణ మొదటి నుంచి ఇప్పటివరకు 4 న్యాయమూర్తుల మార్పు జరిగింది.

MOST READ : 

  1. Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. Chandra Grahanam : హోలీ నాడు చంద్రగ్రహణం, ఈ రాశులకి కష్టాలే.. గ్రహదోష పరిహారాలు..!

  3. Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

మరిన్ని వార్తలు